
అమెరికాలోని సియాటిల్ సెంటర్లో జరుగుతున్న 'బైట్ ఆఫ్ సియాటెల్' కార్యక్రమంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని హార్బర్వ్యూ మెడికల్ సెంటర్కు తరలించగా, వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉన్నట్లు ఆసుపత్రి ప్రతినిధి సూసన్ గ్రెగ్ తెలిపారు.
బాధితుల్లో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నట్లు సియాటెల్ పోలీసులు వెల్లడించారు.