
హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన 17 ఏళ్ల అక్షిత్ ఖేరా కేవలం రూ.1.02 లక్షల వ్యయంతో సౌర విద్యుత్ ఆధారిత త్రిచక్ర వాహనాన్ని రూపొందించాడు.
ఈ వాహనం ఒక్కసారి ఛార్జ్ చేస్తే కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, సౌరశక్తిని పరిగణనలోకి తీసుకుంటే కి.మీ.కి అయ్యే విద్యుత్ ఖర్చు 13 పైసలే అని తెలిపాడు.
2025లో సింగపూర్‌లో జరిగిన స్టెమ్ రేసింగ్ ప్రపంచ పోటీల్లో తన బృందం డిజైన్, తయారీ విభాగంలో పాల్గొన్న అనుభవం ఈ వాహన తయారీకి ఉపయోగపడింది.