
వైకాపా ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా పనిచేసిన పీవీజీడీ ప్రసాదరెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
వీసీగా ఆయన హయాంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఏసీబీ దర్యాప్తు జరిపించాలని విజిలెన్స్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
అధికార దుర్వినియోగం మరియు అక్రమాస్తుల ఆరోపణలపై ఈ చర్య తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.