
దుబాయ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ లెజెండ్స్ ఆఫ్ చాంపియన్‌షిప్ మూడో ఎడిషన్ నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టు అధికారికంగా నిష్క్రమించింది.
భారత జట్టు తమకు లిఖితపూర్వకంగా క్షమాపణ చెబితేనే ఆటగాళ్లకు ఎన్వోసీ ఇస్తామని పీసీబీ పెట్టిన డిమాండ్‌ను నిర్వాహకులు తిరస్కరించారు.
నిర్వాహకులు డిమాండ్లు అంగీకరించకపోవడంతో పాక్ జట్టు టోర్నీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించగా, ఆస్ట్రేలియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది.