
పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.2,500 కోట్ల భారం పడనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గత ప్రభుత్వం నుంచి ఈ డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్న ఆయన, కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం రూ.650 కోట్ల నిధుల విడుదలకు కూడా కేబినెట్ అంగీకరించిందన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 15 వేల మెగావాట్ల నుంచి 19,892 మెగావాట్లకు పెరిగిందని, 5,800 మెగావాట్ల గ్రీన్ పవర్ కోసం టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.