
కాకామిగహరా వేదికగా జరిగిన ఆసియా క్రీడల మహిళల హాకీ పూల్-బి మ్యాచ్‌లో థాయిలాండ్‌పై భారత్ 20-1 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది.
టోర్నీలో భారత్‌కు ఇది వరుసగా మూడో విజయం కాగా, డ్రాగ్ ఫ్లికర్ దీపిక సెహ్రావత్ ఒకే మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 9 గోల్స్ సాధించి చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో నవ్‌నీత్ కౌర్ 4 గోల్స్, రుతుజ దాదాసో పిసాల్ 3 గోల్స్ చేయగా, మరికొందరు ఆటగాళ్లు కూడా స్కోర్ సాధించారు.