
శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో రిషబ్ పంత్ 62 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ అవ్వడంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అసహనం వ్యక్తం చేశారు.
కొత్త బంతిని ఎదుర్కొనేటప్పుడు పంత్ కనీస క్రికెటింగ్ సెన్స్ ఉపయోగించలేదని, ఆచితూచి ఆడాల్సింది పోయి భారీ షాట్లకు యత్నించాడని కైఫ్ విమర్శించారు.
దేవదత్ పడిక్కల్ వంటి బ్యాటర్లు కొత్త బంతిని ఎదుర్కొన్న తీరును ఉదాహరణగా చూపుతూ, పంత్ తన షాట్ల ఎంపికలో పరిణతి చూపాలని సూచించారు.