
వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడి కుమారుడు బొత్స చైతన్య నామినేషన్‌ను పూసపాటిరేగలో ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
పూసపాటిరేగలో చైతన్య పోటీ చేయడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయనకు విజయనగరంలో ఓటు హక్కు ఉందని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈ నిర్ణయంపై వైకాపా జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ మరియు ఆ పార్టీ న్యాయవాదులు జిల్లా కలెక్టర్‌ను కలిసి అప్పీల్ చేశారు.