
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంలో దూసుకుపోతున్న తెలంగాణ, ప్యాసింజర్ కార్ల విభాగంలో అత్యధిక ఈవీల అమ్మకాలతో దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది.
నోమురా బ్రోకరేజ్ సంస్థ రిపోర్టు ప్రకారం.. సెప్టెంబర్లో తెలంగాణలో అమ్ముడైన కార్లలో ఈవీల వాటా 21.0 శాతానికి చేరింది. 21.9 శాతంతో ఢిల్లీ మొదటి స్థానంలో ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం మరియు ఈవీల నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.