
పరకాల వివాదం తర్వాత మంత్రి కొండా సురేఖ తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు.
ఇటీవల పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిపై సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ భేటీ రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఈ వివాదంపై పీసీసీ క్రమశిక్షణా కమిటీ ఇప్పటికే సురేఖకు నోటీసు జారీ చేసినట్లు సమాచారం.