
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధంలో రష్యా సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ స్థాయి ఆఫీసర్ స్టుప్నికోవ్ రహస్య సమాచారాన్ని ఉక్రెయిన్‌కు చేరవేశాడు. ఈ దేశద్రోహ చర్య వల్ల 300 మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
స్టుప్నికోవ్ తన తల్లి తటియానా యాంట్సెన్ సహాయంతో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్‌తో కనెక్షన్ ఏర్పరచుకున్నాడు. సైనిక సమాచారం అందిస్తే నెలకు 4 వేల డాలర్లు ఇస్తామనే ఆఫర్‌తో ఆయన ఈ నెట్వర్క్ ద్వారా సమాచారం చేరవేశాడు.
కడుపునొప్పిగా నటిస్తూ సహచరులకు దూరంగా వెళ్లి రష్యా బలగాల కోఆర్డినేట్లను ఉక్రెయిన్‌కు ఇచ్చేవాడు. 2024 జులైలో తన యూనిట్ నుంచి తప్పించుకుని ఉక్రెయిన్ స్థావరాల వైపు పరారై ప్రస్తుతం రష్యన్ వాలంటీర్ కార్ప్స్లో సేవలందిస్తున్నాడు.