
దేశీ స్టాక్ మార్కెట్ల దిశను నిర్దేశించడంలో ఈ వారం రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) పరపతి విధాన సమీక్ష అత్యంత కీలకం కానుంది.
ద్రవ్యోల్బణం పెరుగుదల నేపథ్యంలో ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం పెంచి 5.5 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
గత వారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.28,000 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించడంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలను చవిచూశాయి.