
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో భారతదేశ చారిత్రక అట్లాస్ 'భారత్రాజ్య' వెబ్సైట్ను రూపొందించిన కృష్ణ శేషాద్రిని ప్రధాని మోదీ మన్ కీ బాత్లో కొనియాడారు.
ఈ వెబ్సైట్లో క్రీ.శ. 700 నుంచి ఆధునిక కాలం వరకు 1000 జిల్లాలకు సంబంధించిన 800 ఏళ్ల చారిత్రక డేటాను పొందుపరిచారు.
కోడింగ్ పరిజ్ఞానం లేకపోయినా క్లాడ్ ఏఐ మోడల్ సాయంతో 15 ఏళ్ల కలను నిజం చేసుకున్న కృష్ణ శేషాద్రి కృషిని ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు.