
మెర్సిడెస్ బెంజ్ సంస్థ భారత మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'జీఎల్సీ ఎలక్ట్రిక్'ను రూ.78.50 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో విడుదల చేసింది.
అక్టోబర్‌లో బుకింగ్స్ ప్రారంభం కాగా ఇప్పటికే 1,000కి పైగా బుకింగ్స్ రావడంతో మార్చి 2027 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయి.
94 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 711 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.