
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై హైదరాబాద్‌లో మంగళవారం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేశారని, అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల అమలుపై పోరాటం చేస్తామని, త్వరలోనే రేవంత్ రెడ్డికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని కేటీఆర్ హెచ్చరించారు.