
దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది.
ఆగస్టు 30న నిర్వహించిన పరీక్షకు 2,63,544 మంది హాజరు కాగా, సెప్టెంబర్ 5న జైపుర్లో నిర్వహించిన పరీక్షకు 2,416 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
అభ్యర్థులు అక్టోబర్ 1 నుంచి అధికారిక వెబ్సైట్ ద్వారా తమ స్కోరు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.