
గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో యశ్ నటిస్తున్న 'టాక్సిక్' చిత్రంలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందన్న విమర్శలపై హీరో యశ్ స్పందించారు.
సినిమాలో తాను కనీసం ఒక్క ముద్దు సన్నివేశంలో కూడా నటించలేదని, క్రియేటివిటీకి ఒక హద్దు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన యశ్, ప్రతి తరం యువతపై విమర్శలు చేయడం సహజమని పేర్కొంటూ సినిమాలోని దృశ్యాల పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించారు.