
పుదుచ్చేరిలో హెల్మెట్ ధరించకుండా, నంబరు ప్లేటు లేని ద్విచక్ర వాహనంపై అసెంబ్లీకి వెళ్తున్న ఎన్నార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వయ్యాపురి మణికందన్‌కు పోలీసులు రూ.1,500 జరిమానా విధించారు.
తూర్పు విభాగం ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ వెంకటాచలపతి ఈ జరిమానాను విధించగా, ఎమ్మెల్యే దీనిపై స్పందిస్తూ డ్రైవర్ల కొరత వల్లే తాను సొంతంగా వాహనం నడపాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించినా, డ్రైవర్లను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆయన వివరణ ఇచ్చారు.