
తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 37 మంది అభ్యర్థులు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు.
వీరిలో ఇప్పటికే 9 మంది విద్యార్థులు వివిధ మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందినట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ తేల్చింది.
నిబంధనల ప్రకారం ఆ 9 మంది విద్యార్థుల సీట్లను రద్దు చేసి, ఆ సీట్లను మలి విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు.