
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అక్టోబర్‌లో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు వెల్లడించారు.
ప్రస్తుతం 5.25 శాతంగా ఉన్న రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని సర్వేలు తెలుపుతున్నాయి.
ఒకవేళ రెపో రేటు పెరిగితే గృహ, వాహన రుణాలు ప్రియమై నెలవారీ ఈఎంఐలు మరింత భారం కానున్నాయి.