
ఉత్తరాఖండ్‌లోని కుంజపురి మేళాలో పంజాబీ గాయకుడు దాలెర్ మెహందీ ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దాలెర్ మెహందీ మద్యం మత్తులో ఉన్నారని, సరిగ్గా మాట్లాడలేక లిప్-సింక్ చేస్తూ ప్రేక్షకులను మోసం చేస్తున్నారని రాష్ట్ర కేబినెట్ మంత్రి సుబోధ్ ఉనియాల్ వేదికపైనే నిలదీశారు.
భారీగా రెమ్యునరేషన్ తీసుకుని కళకు న్యాయం చేయలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.