
ఇండోనేషియాలోని మదురా ద్వీపం సమీపంలో ఆదివారం ప్రయాణిస్తున్న 'ముతియారా సంతోసా-2' ఫెర్రీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
ప్రమాద సమయంలో ఫెర్రీలో మొత్తం 271 మంది ప్రయాణికులు ఉండగా, 41 మంది గల్లంతయ్యారని, వారి కోసం తొమ్మిది నౌకలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
సురబయ నుంచి మకాస్సర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగగా, మంటల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు ప్రయాణికులు సముద్రంలోకి దూకారు.