
బీహార్లో బీపీఎస్సీ (BPSC TRE-3) టీచర్ రిక్రూట్మెంట్ ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక నిందితుడైన ఒక డాక్టర్ను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ లీక్ వ్యవహారంలో సుమారు 30 మంది అభ్యర్థుల నుంచి నిందితులు రూ.1.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ప్రశ్నపత్రాల లీక్ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేసిన అధికారులు, అక్రమాలకు పాల్పడిన ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.