
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా, భారత మార్కెట్లో భాగంగా దేశవ్యాప్తంగా 20 సూపర్ ఛార్జర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది.
అహ్మదాబాద్లో 7వ సర్వీస్ సెంటర్ను ప్రారంభించిన టెస్లా, రిమోట్ డయాగ్నోసిస్ ద్వారా వాహన సమస్యలను పరిష్కరించే సదుపాయాన్ని కల్పిస్తోంది.
భారత్లో విక్రయిస్తున్న మోడల్ Y ఆర్డబ్ల్యూడీ ధర రూ. 51.89 లక్షలు, మోడల్ Yఎల్ ధర రూ. 61.99 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది.