
అమెరికా సుంకాలపై నెలకొన్న సందిగ్ధత, పశ్చిమాసియాలో రవాణా అంతరాయాల వల్ల భారతీయ ఔషధ ఎగుమతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
దేశీయ ఔషధ పరిశ్రమ నిర్దేశించుకున్న వృద్ధి లక్ష్యాలకు ఈ అంతర్జాతీయ అనిశ్చితులు అడ్డంకిగా మారాయని నివేదికలు చెబుతున్నాయి.
టారిఫ్‌ల సెగ కారణంగా ఎగుమతి రంగంలో సవాళ్లు ఎదురవుతున్నాయని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.