
శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే కుమారుడు నమల్ రాజపక్సేను 8 లక్షల డాలర్ల లంచం కేసులో అవినీతి నిరోధక అధికారులు అరెస్టు చేశారు.
2013 నాటి 2.3 బిలియన్ డాలర్ల ఎయిర్‌బస్ ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఖాతాల ద్వారా నమల్‌కు ముడుపులు అందినట్లు దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి.
కొలంబో చీఫ్ మేజిస్ట్రేట్ అసంగ బొదరగమ ఎదుట హాజరుపరిచిన నమల్ను సెప్టెంబర్ 18 వరకు రిమాండ్‌కు పంపుతూ కోర్టు ఆదేశించింది.