
చైనాలోని యున్నాన్ ప్రావిన్స్‌కు చెందిన 24 ఏళ్ల అనాథ యువకుడు షియావో షు తన పెళ్లికి బంధువులు ఎవరూ రారనే భయంతో సోషల్ మీడియా ద్వారా నెటిజన్లను ఆహ్వానించాడు.
ఈ ఆహ్వానానికి స్పందించిన వేలాది మంది నెటిజన్లు పెళ్లికి తరలివచ్చి వంటలు, అలంకరణతో వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.
అంతేకాకుండా ఒక అతిథి ఈ పెళ్లిలో ఆ యువకుడికి ఏకంగా బెంజ్ కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.