సికింద్రాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించి, హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజును నిందితుడిగా గుర్తించారు.
ఆగస్ట్ 31న బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో చోరీ చేసిన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ను నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్‌లోని తన స్వగ్రామంలో గుంత తీసి పాతిపెట్టగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్ట్ చేశామని, మల్లేశ్ ఆయుధాలను ఎందుకు చోరీ చేశాడనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.