Indian Politics
అంబటి రాంబాబు సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

అంబటి రాంబాబు సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

AP7AM1h
THE BRIEF
1

గుంటూరులో అనుమతి లేకుండా మెగా డీఎస్సీ నిరసన ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి సహా 17 మంది వైసీపీ నేతలపై కేసు నమోదైంది.

2

ఈనెల 10న శంకరవిలాస్ సెంటర్ నుండి అంబేద్కర్‌ విగ్రహం వరకు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించి ర్యాలీ చేపట్టారని పోలీసులు తెలిపారు.

3

ప్రజా రవాణాకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినందుకు అరండల్‌పేట ఎస్‌ఐ ఈశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.