
తెలంగాణ హైకోర్టు తనపై విధించిన అనర్హత వేటును సవాల్ చేస్తూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ దాఖలు చేశారు.
బీఆర్‌ఎస్ తరఫున గెలుపొంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్‌పై హైకోర్టు శుక్రవారం అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే.