
లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియంలో జరిగిన 'రామాయణం పార్ట్ 1' గ్లోబల్ 3D ప్రీమియర్ వేడుకలో నటి సాయిపల్లవి పాల్గొని మాట్లాడారు.
రావణుడు పూర్తిగా చెడ్డవాడు కాదని, మనందరిలోనూ ఉన్న రావణాసురుడిని గుర్తించి మార్పు చేసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.
ఇతిహాస పాత్రపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ వివాదాస్పదంగా మారాయి.