
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటాపై న్యూ మెక్సికో కోర్టు 567 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 4,750 కోట్లు) జరిమానా విధించింది.
చిన్నారుల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే ఫీచర్లను కొనసాగించడం, సమాచారాన్ని దాచిపెట్టడం వంటి ఉల్లంఘనలకు గాను ఈ చర్య తీసుకున్నారు.
జరిమానాలో 420 మిలియన్ డాలర్లను యువత మానసిక చికిత్సకు, మిగిలిన మొత్తాన్ని అవగాహన కార్యక్రమాలకు ఖర్చు చేయాలని కోర్టు ఆదేశించింది.