
ఫిలిప్పీన్స్‌లోని పాలావాన్ తీరానికి 2.2 కిలోమీటర్ల దూరంలో 'ఎంవీ జూన్ ఆస్టర్' ఫెర్రీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు మరణించారు.
ప్రమాద సమయంలో పడవలో 134 మంది ఉండగా, ఇప్పటివరకు 42 మందిని మాత్రమే రక్షించగలిగారు, మరో 87 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
కోస్ట్‌గార్డ్ అధికారులు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, మంటల్లో చిక్కుకున్న పడవకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.