
ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండటంతో, నాలుగు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడి మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 210.08 పాయింట్లు నష్టపోయి 78,428.95 వద్ద, నిఫ్టీ 159.40 పాయింట్లు క్షీణించి 24,614.90 వద్ద స్థిరపడ్డాయి.
బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఐటీ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించగా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ 2 శాతానికి పైగా పతనమైంది.