
ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అమెరికా రక్షణ వ్యవస్థలోని థాడ్, పేట్రియట్ ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు భారీగా తగ్గాయని సీఎన్ఎన్ నివేదించింది.
యుద్ధానికి ముందున్న నిల్వలతో పోలిస్తే థాడ్ ఇంటర్సెప్టర్లలో 80 శాతం, పేట్రియట్ ఇంటర్సెప్టర్లలో 50 శాతాన్ని అమెరికా సైన్యం ఇప్పటికే వినియోగించింది.
క్షిపణుల కొరత కారణంగానే గత వారం ఇరాన్‌పై తలపెట్టిన భారీ దాడిని అమెరికా వాయిదా వేసిందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.