హైదరాబాద్ కోకాపేటలో 65 అంతస్తులతో 450 అల్ట్రా లగ్జరీ ఫ్లాట్లతో కూడిన ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును రూ.4,200 కోట్ల అంచనా ఆదాయంతో నిర్మిస్తున్నారు.
సుమారు 240 మీటర్ల ఎత్తుతో నిర్మితమయ్యే ఈ ట్విన్ టవర్లలో ఒక్కో ఫ్లాట్ ధర రూ.5 కోట్ల నుంచి ప్రారంభం కానుండగా, ఇప్పటికే 8 పెంట్‌హౌస్‌లు అమ్ముడయ్యాయి.
ట్రంప్ ఆర్గనైజేషన్, ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.