
పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థలో లోతైన లోపాలు ఉన్నాయని, ఒక వ్యక్తిగా తాను మార్పు తీసుకురావడం సాధ్యం కాదని వసీం అక్రమ్ పేర్కొన్నాడు.
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో 0-2తో వెనుకబడిన పాక్ జట్టు, మూడో టెస్టులోనూ ఓడిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
జట్టు వైఫల్యానికి కేవలం ఆటగాళ్లను మాత్రమే కాకుండా, దేశవాళీ క్రికెట్ నిర్మాణంలోని గందరగోళాన్ని ఆయన తప్పుబట్టారు.