
తూర్పు మధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 20 తర్వాత వాయుగుండం ఏర్పడి, ఈ ఏడాది తొలి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ తుపానుకు బంగ్లాదేశ్ సూచించిన ‘ఆర్నబ్’గా నామకరణం చేయనుండగా, ఇది ఉత్తరాంధ్ర, పశ్చిమ ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉంది.
ఎల్‌నినో, వేడిగాలుల ప్రభావంతో ఇది తీవ్ర తుపానుగా బలపడే సూచనలున్నాయని, దీనివల్ల తీవ్ర జలసంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి వర్షాల రూపంలో ఊరట లభించనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.