
తిరుపతి జిల్లా సత్యవేడు మండలం శ్రీసిటీలోని టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు.
పేలుడు తీవ్రతకు పరిశ్రమ శకలాలు సుమారు 100 మీటర్ల దూరంలో పడిపోగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.