
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ జోహో ఈ ఏడాది ఉద్యోగులకు జీతాల పెంపు ఉండదని స్పష్టం చేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంబంధిత ఖర్చులు విపరీతంగా పెరగడం, సాఫ్ట్వేర్ వ్యాపార భవిష్యత్తు అనిశ్చితంగా మారడమే దీనికి కారణమని సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు.
డేటా సెంటర్ల కోసం సర్వర్ల ధరలు నాలుగు రెట్లు పెరిగాయని, మార్కెటింగ్ బడ్జెట్లో కోత విధించామని, గత 18 నెలలుగా కొత్త నియామకాలు లేవని వెంబు వివరించారు.