తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) గదులను నకిలీ ఆధార్ కార్డులను ఉపయోగించి అక్రమంగా బుక్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ముఠా సభ్యులు ఆరుగురు వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించి, భక్తులకు గదులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.
నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారి వద్ద ఉన్న నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు.