
సీఎం చంద్రబాబును అరెస్టు చేసి 53 రోజులు జైలులో నిర్బంధించిన సందర్భంగా సెప్టెంబర్ 9న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు.
తాళ్లూరులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం తెలిపారు, రాష్ట్ర నాటక అకాడమి కార్పొరేషన్ డైరెక్టర్ బి.ఓబుల్‌రెడ్డి పాల్గొన్నారు.
పంగులూరు మండలం ముప్పవరం వద్ద హైవేపై, దొనకొండ, అద్దంకి, ముండ్లమూరులోని ఎన్టీఆర్ విగ్రహాల వద్ద టీడీపీ నేతలు కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు.