
హైదరాబాద్ కోకాపేటలో 65 అంతస్తులతో సౌతిండియాలోనే అత్యంత ఎత్తైన 242 మీటర్ల ట్రంప్ టవర్స్ ప్రాజెక్టును ట్రిబెకా డెవలపర్స్, ఐరా రియాల్టీ నిర్మిస్తున్నాయి.
సుమారు రూ.1,800 కోట్ల పెట్టుబడితో నిర్మించే ఈ ప్రాజెక్టులో 450కి పైగా లగ్జరీ ఫ్లాట్లు ఉండగా, ధరలు రూ.5.3 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు ఉన్నాయి.
అక్టోబర్‌లో జరిగే ప్రారంభోత్సవానికి ఎరిక్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉండగా, మొత్తం అమ్మకాల్లో 25 నుంచి 30 శాతం ఎన్ఆర్ఐల నుంచే వచ్చే అవకాశం ఉందని అంచనా.