
యెమెన్‌లోని మోఖా పోర్టులో హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన డ్రోన్, మిసైల్ దాడుల్లో 11 మంది మరణించగా, 32 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
సౌదీ అరేబియాలోని జజాన్ నగరంలో ఉన్న అరామ్కో ఆయిల్ రిఫైనరీపై కూడా హౌతీలు డ్రోన్లతో దాడి చేయడంతో మంటలు ఎగసిపడ్డాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత నెలలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని హౌతీలు రద్దు చేసుకున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ దాడులు జరిగాయి.