విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'రణబాలి' అక్టోబర్ 16న విజయదశమి సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.
రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా జయమ్మగా, ఆర్నాల్డ్ వోస్లూ సర్ థియోడర్ హెక్టర్ పాత్రలో నటిస్తున్నారు.
1854 నుంచి 1878 మధ్య రాయలసీమ ప్రాంతంలో జరిగిన చారిత్రక వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను టీ సిరీస్ సమర్పణలో నిర్మిస్తున్నారు.