
మహారాష్ట్ర ఛారిటీ కమిషనర్ విధించిన ఆంక్షల కారణంగా సర్ రతన్ టాటా ట్రస్ట్ తన ప్రతినిధిని నామినేట్ చేయలేకపోవడంతో టాటా సన్స్ ఏజీఎం వాయిదా పడింది.
ఈ నెల 18న జరగాల్సిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) నిర్వహించే అవకాశం లేదని ఈ వ్యవహారంతో సంబంధమున్న వర్గాలు వెల్లడించాయి.
టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీలో కీలక వాటాదారుగా ఉన్న ట్రస్ట్ ప్రతినిధి లేకపోవడం వల్ల ఈ వారం సమావేశం జరగడం లేదని సమాచారం.