
బ్రెజిల్లో సుమారు 16 హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వాను పోలీసులు అరెస్ట్ చేశారు.
సన్నని దేహదారుడ్యం కారణంగా స్థానికంగా 'మస్కిటో' (దోమ) అని పిలిచే ఈ నిందితుడు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అడవుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకున్నాడు.
సెప్టెంబర్ 13న పారైబాలోని ములుంగు ప్రాంతంలో మహిళలా వేషం మార్చి, పసికందును ఎత్తుకుని పారిపోతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.