ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఇంటి ముందు ఓ యువతి ఆందోళనకు దిగింది.
ఛైర్మన్ కుమారుడు శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకుని మూడు సార్లు అబార్షన్లు చేయించాడని బాధితురాలు ఆరోపించారు.
ఈ విషయంపై ఎమ్మెల్యేను ఆశ్రయించినప్పటికీ తనకు న్యాయం జరగలేదని ఆమె వాపోయారు.