
కాంగో నదిలో రెండు మోటార్ చెక్క పడవలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈక్వేటర్ ప్రావిన్స్‌లోని న్గోంబే-లుకోలెలా ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగిందని ప్రావిన్షియల్ అంతర్గత వ్యవహారాల మంత్రి క్రిస్పిన్ మ్పుటు తెలిపారు.
ఈ దుర్ఘటనలో డజన్ల కొద్దీ ప్రయాణికులు గల్లంతుకాగా, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.