
విమానయాన దిగ్గజం ఇండిగో దేశీయ ఫ్లైట్లలో మూడు రోజుల నుంచి రెండేళ్ల లోపు పిల్లల ఛార్జీలను రూ.2,200 నుంచి రూ.3,000కు పెంచింది.
ఒంటరిగా ప్రయాణించే మైనర్ల ఛార్జీలు దేశీయ విమానాల్లో రూ.5,999గా, అంతర్జాతీయ విమానాల్లో రూ.12,999గా ఉంటాయని పేర్కొంది.
పెరిగిపోయిన నిర్వహణ వ్యయాలు, ఇంధన ధరల కారణంగానే ఈ అనుబంధ సేవల ఛార్జీలను పెంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.